సేల్ఫీ రాజా సినిమా రివ్యూ
చిత్రం : ‘సెల్ఫీ రాజా’
నటీనటులు: అల్లరి నరేష్ – కామ్న- సాక్షి చౌదరి – సప్తగిరి – తాగుబోతు రమేష్ – పృథ్వీ – నాగినీడు – రవిబాబు – కృష్ణభగవాన్ – శ్రీలక్ష్మి తదితరులు
సంగీతం: సాయికార్తీక్
ఛాయాగ్రహణం: లోక్ నాథ్
నిర్మాత: రామబ్రహ్మం చౌదరి
స్క్రీన్ ప్లే – దర్శకత్వ: ఈశ్వర్ రెడ్డి
నటీనటులు: అల్లరి నరేష్ – కామ్న- సాక్షి చౌదరి – సప్తగిరి – తాగుబోతు రమేష్ – పృథ్వీ – నాగినీడు – రవిబాబు – కృష్ణభగవాన్ – శ్రీలక్ష్మి తదితరులు
సంగీతం: సాయికార్తీక్
ఛాయాగ్రహణం: లోక్ నాథ్
నిర్మాత: రామబ్రహ్మం చౌదరి
స్క్రీన్ ప్లే – దర్శకత్వ: ఈశ్వర్ రెడ్డి
కథ:
సెల్ఫీలంటే పడి చచ్చే రాజా తన పేరునే ‘సెల్ఫీ రాజా’గా మార్చుకుంటాడు. రాజాకు నోటిదూల ఎక్కువే. లేనిపోని అబద్దాలు ఆడేసి.. చివరికి ఇక్కట్లపాలవుతాడు. కమిషనర్ కూతురైన శ్వేత (కామ్న) అనే అమ్మాయికి కొన్ని అబద్ధాలు చెప్పి దగ్గర అవుతాడు. అదే సమయంలో అతని మంచి మనసును చూసి శ్వేత ప్రేమిస్తుంది. ఇద్దరూ పెళ్లి చేసుకొంటారు. అయితే అనుకోని కారణాల వల్ల సెల్ఫీ రాజా తన భార్య నుండి దూరం అవుతాడు. ఆ సమయంలో రాజాకు జీవితం మీద విరక్తి పుట్టి చచ్చిపోవాలనుకుంటాడు. తనను చంపమని ఓ రౌడీకి కాంట్రాక్టు ఇస్తాడు. విచిత్రంగా రాజా ని పోలిన మరో వ్యక్తి భీమ్స్ (అల్లరి నరేష్) ఉండడంతో కథ మలుపులు తిరుగుతుంది. మరి రాజా, అతని భార్య కలుసుకుంటారా? పోలికల్లో ఒకలాగే ఉన్న భీమ్స్‌కి.. రాజాకి మధ్య సంబంధం ఏంటి? తదితర విషయాలు తెరపైనే చూడాలి.
సాంకేతికవర్గం:
సినిమాను బట్టే అందులో పనిచేసే టెక్నీషియన్ల పనితీరు కూడా ఉంటుంది.సినిమాలో ఇన్స్పైర్ చేసే అంశాలు ఏమి లేనప్పుడు వారుమాత్రం ఏమి చేయలేరు.ఇక ఉన్నంతలో సాయి కార్తీక్ సంగీతం బెటర్ అనే చెప్పోచ్చు. లోక్ నాథ్ ఛాయాగ్రహణం కూడా పర్వాలేదనిపించాయి.ఎడిటర్ ఎం.ఆర్ వర్మ సినిమా ఇంకాస్త ట్రిం చేసుంటే బాగుండేది.. అక్కడక్కడ జర్క్ లు వచ్చినట్టు అనిపిస్తుంది. ఇక సినిమా నిర్మాణ విలువల విషయానికొస్తే కథకు తగ్గట్టు ఎంత అవసరమో అంత ఖర్చు పెట్టడంలో ఏమాత్రం వెనుకాడలేదు. రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో సినిమా కూడా రిచ్ గానే అనిపించింది. ఇక దర్శకుడిగా కథనం ఏమన్నా గ్రిప్పింగ్ తో నడిపించాడా అంటే కొన్ని చోట్ల కామెడీ వర్క్ అవుట్ అయినా మరికొన్ని చోట్ల మాత్రం కాస్త ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది. దర్శకుడిగా ఈశ్వర్ పూర్తిగా నిరాశ పరిచాడు.
హైలెట్స్ :
అల్లరి నరేష్
పృథ్వీ
ఎంటర్ టైన్మెంట్
పృథ్వీ
ఎంటర్ టైన్మెంట్
డ్రా బ్యాక్స్ :
స్క్రీన్ ప్లే
No comments