Header Ads

  • Breaking News

    సినిమా టికెట్ కోసం వేలు పోగొట్టుకున్నాడు


    సినిమా టికెట్లు దక్కించుకోవాలన్న ఆత్రంతో ఓ యువకుడు వేలు పోగొట్టుకున్నాడు. వనస్థలిపురం విష్ణు థియేటర్ వద్ద శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. 'సర్ధార్ గబ్బర్‌సింగ్' సినిమా టికెట్ల కోసం ఓ యువకుడు విష్ణు థియేటర్ వద్దకు వెళ్లాడు. 
     
    మెయిన్ గేటు ఎక్కి లోపలికి దూకే సమయంలో వాచ్‌మెన్ ఒక్కసారిగా గేటును తెరిచాడు. అప్పటికే గేటుపై ఉన్న ఆ యువకుడు సరాసరి కిందికి దూకడంతో వేలు గేటులో ఇరుక్కుని తెగి పడిపోయింది. తీవ్ర రక్తస్రావం కావడంతో స్థానికులు అతన్ని వైద్య చికిత్స కోసం తరలించే ప్రయత్నం చేసినప్పటికీ... భయంతో బాధితుడు అక్కడి నుంచి పారిపోయాడు. 
                                                                                                                                      source:సాక్షి దినపత్రిక

    No comments

    Post Top Ad

    Post Bottom Ad