Header Ads

  • Breaking News

    అ..ఆ.. టీమ్‌తో పవన్ కళ్యాణ్



    ఇటీవల ‘సర్దార్‌’గా తెరమీదికొచ్చిన పవన్ తాజాగా ‘అ.ఆ..’ సెట్లో తళుక్కుమన్నారు. నితిన్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ చివరిదశలో ఉంది. నితిన్ సహా ఇతర కీలక పాత్రధారులపై హైదరాబాద్‌లో వేసిన ప్రత్యేక సెట్లో ఓ పాటని చిత్రీకరిస్తున్నారు. ఈ సెట్‌లోకి పవన్ రావడం పట్ల ‘అఆ’ హీరో పవన్ అభిమాని అయిన నితిన్, దర్శకుడు త్రివిక్రమ్ సంతోషం వ్యక్తం చేశారు. త్రివిక్రమ్‌, ఇతర కాస్ట్ అండ్ క్రూతో కాసేపు పవన్ ముచ్చటించడం పట్ల చిత్ర బృందం ఖుషీగా ఉందని హీరో నితిన్ తెలిపారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బేనర్‌పై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న ఈ సినిమా మే 6 విడుదల కానున్న సంగతి తెలిసిందే.

    No comments

    Post Top Ad

    Post Bottom Ad