Header Ads

  • Breaking News

    మళ్లీ రాజకీయాల్లోకి మోహన్ బాబు


    మోహన్ బాబు… రాజకీయాల్లోకి పునః ప్రవేశం చేస్తున్నారట. అయితే కొత్త పార్టీ పెట్టే ఉద్దేశం లేదని, ప్రస్తుతం ఉన్న పార్టీల్లోనే చేరుతానని తిరుపతిలో ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయాల గురించి తొందరలోనే ప్రకటన చేస్తానని అన్నారు. తనకు చంద్రబాబు, జగన్‌ ఇద్దరూ బంధువులేనని అన్నారు. ఏ పార్టీలో చేరేది త్వరలో ప్రకటిస్తానని ఆయన తెలిపారు. ఎన్టీఆర్‌కు అభిమాని కావడంతో పాటు గతంలో టీడీపీ తరుపున రాజ్యసభ సభ్యుడిగా కూడా పని చేశారు. మరోపక్క ఇటు జగన్‌కు బంధువు కూడా కావడంతో, టీడీపీలో చేరతారా లేక వైసీపీలో అడుగు పెడతారా అనేది చర్చనీయాంశంగా మారింది.

    No comments

    Post Top Ad

    Post Bottom Ad