Header Ads

  • Breaking News

    ప్రేమమ్ సినిమా ఆగష్టు 12న విడుదల కు సిద్దం


    నాగచైతన్య డబుల్ ధమాకా అంటూ కొన్నాళ్ళనుండి ఊరిస్తూనే ఉన్నాడు. ఇప్పుడా ముహుర్తం రానే వచ్చింది. ఆయన హీరోగా నటించిన ‘సాహసం శ్వాసగా సాగిపో’, ‘ప్రేమమ్’ సినిమాలు నెల రోజుల వ్యవధిలో తెరమీదికి రానున్నాయి. ‘ఏ మాయ చేశావే’ తర్వాత గౌతమ్ మీనన్ దర్శకత్వంలో చైతూ నటించిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమా చిత్రీకరణ పూర్తై విడుదలకు సిద్ధంగా ఉంది. జూన్ 17న పాటల్ని, జులై 15న సినిమాని రిలీజ్ చేసేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. 

    మరోవైపు చందు మొండేటి దర్శకుడిగా మలయాళ చిత్రం ‘ప్రేమమ్’ తెలుగులో రీమేక్ అవుతోన్న సంగతి విధితమే. ఈ సినిమా చిత్రీకరణ సైతం ఇప్పడు తుది దశకు చేరుకుంది. సితార ఎంటర్టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగష్టు 12న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుందిట. ముందుగా అనుకున్న ప్రకారమైతే జులైలోనే ‘ప్రేమమ్’ తెరమీదికి రావాల్సుంది. అయితే ‘సాహసం..’ విడుదలలో జాప్యం, వెంకటేష్ హీరోగా సితార ఎంటర్టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న ‘బాబు బంగారం’ చిత్రం అదే సమయానికి విడుదల కానుండటం తదితర కారణాలతో ఆగష్టుకి మార్చారట. ఏమైనా నెల తిరక్కుండానే రెండు విజయాలను వరుసగా తన ఖాతాలో వేసుకునేందుకు ఈ అక్కినేని హీరో రెడీ అవుతున్నాడన్నది అసలు విషయం. అన్నట్టు ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’ సినిమా సైతం అదే రోజున తెరమీదికి రానుంది. అంటే బాక్సాఫీస్ వద్ద నందమూరి వర్సెస్ అక్కినేని యుద్ధం మొదలవనుందన్నమాట.

    No comments

    Post Top Ad

    Post Bottom Ad