Header Ads

  • Breaking News

    గబ్బర్ సింగ్..బెగ్గర్ సింగ్

     
     రామ్ గోపాల్ వర్మ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పై మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇటీవల పవన్ ఏపీకి 'ప్రత్యేక హోదా' విషయంలో పోరాటం చేయాలని సీమాంధ్ర ప్రజల తరఫున ట్విట్టర్ వేదికగా అధికార పార్టీ ఎంపీలకు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. పవన్ విన్నపాన్ని ఎద్దేవా చేస్తూ రామ్ గోపాల్ వర్మ మాటల తూటాలతో విరుచుకుపడ్డారు.

    'విజ్ఞప్తి కాదు.. డిమాండ్ చేస్తే ప్రత్యేక హోదా వస్తుంది. ఫ్లాపైనా మాకు గబ్బర్ సింగ్ కావాలిగానీ.. బెగ్గర్ సింగ్ కాదు. అసలు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కాదు.. రియల్ స్టార్ కేటీఆర్' అంటూ ఘాటైన కామెంట్లు చేశాడు రామ్ గోపాల్ వర్మ. ఇప్పటికే పవన్ ఫ్యాన్స్ కు, రామూకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తాజా కామెంట్లతో రామూ మరోసారి పవన్ ఫ్యాన్స్ ను రెచ్చగొట్టినట్లయ్యింది.

    No comments

    Post Top Ad

    Post Bottom Ad